Aamir Khan: బన్నీతో సినిమాపై ఆమిర్ క్లారిటీ

పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ సినిమాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) విపరీతమైన క్రేజ్ అందుకున్నాడు. పుష్ప2(Pushpa2) తర్వాత బన్నీ(Bunny) ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్న టైమ్ లో అట్లీ(Atlee)తో సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు బన్నీ. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ బన్నీకి సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది.
అల్లు అర్జున్ త్వరలోనే బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నాడని, ఆ సినిమాలో ఆమిర్ ఖాన్(Aamir Khan) కూడా నటించే ఛాన్సులున్నాయని, వీరిద్దరితో గీతా ఆర్ట్స్(Geetha Arts) ఓ భారీ సినిమాను నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయని, అందులో ఓ బాలీవుడ్ నిర్మాత కూడా భాగస్వామ్యం కానున్నారని వార్తలు రాగా, తాజాగా సితారే జమీన్ పర్(Sithare zameen par) ప్రమోషన్స్ లో ఆమిర్ ఖాన్ ఈ విషయంపై రెస్పాండ్ అయ్యారు.
తనకు అల్లు అరవింద్(Allu Aravind) ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్నాయని, వారి బ్యానర్ లో గజినీ(Gajini) సినిమా చేయడంతో ఆ బాండింగ్ ఇంకాస్త పెరిగిందని, బన్నీ(Bunny)ని తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ఆ పరిచయంతోనే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామని, తామిద్దరం కలిసి ఓసారి దిగిన ఫోటో వల్లే ఆ వార్తలు వచ్చి ఉంటాయనుకుంటున్నానని, ఇప్పటికైతే తామిద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేయడం లేదని, భవిష్యత్తులో చేసే అవకాశమొస్తే చెప్పలేనని, ఇప్పుడు మాత్రం అలాంటి ఆలోచన లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు.