Aadhi Pinisetty: మరో భారీ సినిమాలో విలన్ గా ఆది

డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి(raviraja pinisetty) కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి(Aadhi pinisetty) చాలా తక్కువ టైమ్ లోనే తనకంటూ సొంత గుర్తింపుతో పాటూ మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. కెరీర్ మొదటి నుంచే ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చిన ఆది ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
ఇప్పటికే యాక్టర్ గా తన సత్తాను చాటుకున్న ఆది, ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ2(akhanda2) సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆది క్యారెక్టర్ ను బోయపాటి నెక్ట్స్ లెవెల్లో డిజైన్ చేశాడంటున్నారు.
ఆల్రెడీ అఖండ2 ను పూర్తి చేసిన ఆది ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అది తెలుగు సినిమా కాదు. కార్తీ(karthi) హీరోగా తమిజ్(Thamizh) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మార్షల్ మూవీలో ఓ క్యారెక్టర్ కోసం ఆదిని తీసుకున్నారట. ఆ క్యారెక్టర్ కు నెగిటివ్ షేడ్స్ ఉండటంతో పాటూ సినిమాలో ఆది చేయబోయే క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సమాచారం. అయితే మార్షల్ మూవీలో ఆది ఒప్పుకున్న క్యారెక్టర్ ను మలయాళ నటుడు టోవినో థామస్(Tovino Thomas) చేస్తాడని గతంలో వార్తలు వినిపించాయి.