రిలీజైన వారానికి భగవంత్ కేసరి ట్విస్ట్
రిలీజ్ కు మరో వారం రోజులే ఉన్న భగవంత్ కేసరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటూనే ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. సినిమాలో బాలయ్య పెద్ద వయస్కుడిగా కనిపిస్తున్నాడు.
అయితే భగవంత్ కేసరిలో ఫ్లాష్ బ్యాక్, ఊహించని సర్ప్రైజ్లు ప్రేక్షకుల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయని తెలుస్తోంది. అంతే కాదు ఫ్యాన్స్ ఊహించని మరో ట్విస్ట్ ను సినిమా రిలీజ్ అయ్యాక మొదటి వారం రోజులు కూడా దాచి పెట్టనున్నారట. బాలయ్య ఎవర్ గ్రీన్ సాంగ్ దంచవే మేనత్త కూతురా సాంగ్ రీమిక్స్ ని దసరా కానుకగా మొదటి వారం అయ్యాక థియేటర్లలో యాడ్ చేయనున్నారట.
ముందు సినిమా చూసే వారికి ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. హిట్ టాక్ వస్తే రెండు మూడు సార్లు ఫ్యాన్స్ ఈజీగా షోలు వేస్తారు. అలాంటిది ఈ సాంగ్ రీమిక్స్ ఉందంటే తప్పకుండా వెళ్తారు. కాబట్టి ఇది ఎలా చూసినా వర్కవుట్ అయ్యే ఐడియాలానే ఉంది. ఈ సినిమాతో పాటూ దసరాకు మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నా హైప్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా పండగ విన్నర్‌గా నిలుస్తుందని అందరూ అంటున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కీలకపాత్రలో కనిపిస్తుంది. తమన్ సంగీతంలో వస్తున్న భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.













