తక్కువ గ్యాప్ లో నిధి నుంచి 3 పాన్ ఇండియా సినిమాలు
ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ హీరోయిన్ నిధి అగర్వాల్(Niddhi Agerwal) కెరీర్ పెద్దగా ఊపందుకోలేదు. ఆ సినిమా తర్వాత రెండు మూడు తమిళ సినిమాలు చేసింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. గల్లా అశోక్(Galla Ashok) తో హీరో(Hero) అనే భారీ బడ్జెట్ సినిమా చేసినా లాభం లేకపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి హరిహర వీరమల్లు(Harihara Veeramallu)లో నటించే ఛాన్స్ రావడంతో వెంటనే ఒప్పేసుకుంది.
కానీ ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉంది. దీంతో అమ్మడికి కొంత నిరాశ తప్పలేదు. తర్వాత కొన్నాళ్లకు ప్రభాస్(Prabhas) సరసన ది రాజా సాబ్(the raja saab) లో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మారుతి(maruthi), నిధి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండేలా డిజైన్ చేశాడని టాక్. అయితే వచ్చే ఏడాది నిధి అగర్వాల్ నుంచి అతి తక్కువ గ్యాప్ లోనే మూడు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి.
పవన్ తో చేస్తున్న హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ కానుంది. ఆ తర్వాత రెండు వారాల్లోపే ఏప్రిల్ 10న ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్ అవుతుంది. వందల కోట్ల బిజినెస్ చేయనున్న ఈ రెండు సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ దక్కనుంది. వీటితో పాటూ తేజ సజ్జ(teja sajja) హీరోగా వస్తోన్న మిరాయ్(miraai) మూవీ స్పెషల్ సాంగ్ లో నిధి అగర్వాల్ మెరవనుంది. ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోయిందట. ఏప్రిల్ 18న మిరాయ్ రిలీజ్ కానుంది. మొత్తంగా 20 రోజుల గ్యాప్ లో నిధి నుంచి మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.













