23న ’24 ముద్దులు’
హెబ్బా పటేల్ ఆదిత్ అరుణ్ జంటగా నటించిన 24 కిస్సెస్ రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. నవంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ దాటేసి సంచలనం రేపింది. అందులో కంటెంట్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయనే అంచనాలు ఏర్పడ్డాయి. మిణుగురులు సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కుమార్ కృష్ణం శెట్టి ఈ చిత్రానికి దర్శకుడు కావటం ప్రత్యేక ఆకర్షణ. రావు రమేష్ పాత్ర స్పెషల్‌గా డిజైన్ చేసినట్టు ట్రైలర్లో అర్థమైంది. జోయ్ బారువా సంగీతం కూడా ప్లస్‌గా నిలస్తుందని అంటున్నారు. హెబ్బాపటేల్ కూడా ఈ చిత్రం పై గట్టి నమ్మకంతో ఉన్నారని తెలిసింది. యూత్‌ను టార్గెట్ చేసిన చిత్రం కాదని, దాని నేపథ్యంలో వల్ల అలా పేరు పెట్టాల్సి వచ్చిందని దర్శకుడు అయోధ్యకుమార్ తెలిపారు.













