యూఎస్‌లో బాహుబలి -2 రికార్డు

బాహుబలి-2 ద కన్ క్లూజన్ తన ఖాతాలో మరో రికార్డును వేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 ఓవరాల్ కలెక్షన్లను, బాహుబలి -2 ప్రీ బుకింగ్స్‌తోనే కొల్లగొట్టడం విశేషం. అమెరికాలో ఖైదీ నంబర్ 150 సినిమా 2.45 మిలియన్ డాలర్లు (15 కోట్ల 70 లక్షల రూపాయలు) వసూలు చేయగా, బాహుబలి-2 ద కన్ క్లూజన్ అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ తో ఏకంగా 3 మిలియన్ డాలర్ల (దాదాపు 19 కోట్ల రూపాయలు) వసూళ్లు రాబట్టిందని ఆ దేశంలో బాహుబలి -2 ద కన్ క్లూజన్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ సంస్థ ప్రకటించింది. రికార్డు స్థాయిలో యూఎస్‌లో గంటలకు 64 లక్షల రూపాయల విలువ చేసే టికెట్స్ బుక్ అవుతున్నాయని వారు వెల్లడించారు.