Roshan Kanakala: ‘మోగ్లీ’ జెన్యూన్ లవ్ స్టొరీ, సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది- రోషన్ కనకాల
యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025 (Mowgli 2025) తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే టీజర్, పాటలు, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మోగ్లీ కథ ఎలా ఉండబోతుంది?
-ఇది ప్యూర్ అండ్ ఇన్నోసెన్స్ వుండే లవ్ స్టోరీ. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ సందీప్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఇందులో హానెస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ ప్రేమ కథని అద్భుతంగా పండించాడు. ఈ కథలో కామెడీ యాక్షన్ అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా ఆర్గానిక్, జెన్యూన్ గా రాశాడు
– మోగ్లీ తన ప్రేమ కోసం దేనికైనా రెడీగా ఉంటాడు. తన ప్రేమ కథకు వచ్చిన అడ్డంకేంటి? క్రిస్టఫర్ నోలన్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేదాన్ని బట్టి ఈ కథ ముందుకు వెళుతుంది.
– మోగ్లీ అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అందరూ కూడా ఆ క్యారెక్టర్ కి రిలేట్ అవుతారు.
బబుల్ గమ్ తర్వాత ఈ కథ ఎంచుకున్నారు కదా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా బోర్ ఫీల్ కాకుండా ఉండే కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో సందీప్ ఈ కథతో వచ్చారు ఇది థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన కథ.
మోగ్లీ జస్టిఫికేషన్ ఏమిటి?
-ఈ కథ అనుకున్నప్పుడే ఈ టైటిల్ ని అనుకున్నాం. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఇందులో హీరో క్యారెక్టర్ కి ఈ టైటిల్ ఫర్ఫెక్ట్ యాప్ట్. అలాగే ప్రేమ కథ కూడా హెల్ప్ అవుతుంది.
ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో షూటింగ్ చేయడం చాలెంజింగ్ అనిపించిందా?
ప్రాక్టికల్ గా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే నేను అన్ని ఎంజాయ్ చేస్తూ చేశాను. చేసే పనిని ప్రేమించి చేశాను. దీంతో అంతా సరదాగ గడిచింది.
– 60% ఆఫ్ షూటింగ్ ఫారెస్ట్ లోనే చేశాము. సినిమాలో అన్ని రియల్ లొకేషన్స్ ఉంటాయి. ఈ సినిమా తర్వాత ఫారెస్ట్ కి చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాం
మీకు ఇంట్లో ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు?
-నటనపరంగా నాన్నకి నాకు ఎప్పుడూ ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అలాగే అమ్మతో కూడా మాట్లాడుతూ ఉంటాను. డిస్కషన్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. వాళ్ళు కూడా నాకు అవసరమైన సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. ఈ సినిమాకి కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి.
– చిన్నప్పుడే సినిమా వాతావరణంలో ఉండడంతో సినిమా మీద నాకు ఒక ప్రేమ ఏర్పడిపోయింది. ఈ విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ ప్రయాణాన్ని నేను ఆస్వాదిస్తున్నాన. ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను.
ఈ సినిమాలో మీది, బండి సరోజ్ గారి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది?
ఈ కథకి ఆయన చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యారు. ఆ క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మా మధ్య ఉండే సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.
హర్ష తో మీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది?
-హర్ష ఇందులో చాలా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ చేశాడు. కథలో తన పాత్ర చాలా కీలకం. మా ఇద్దరి మధ్య జెన్యూన్ గా ఫ్రెండ్షిప్ వర్కౌట్ అయింది.
కాలభైరవ మ్యూజిక్ గురించి?
-కాలభైరవ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కీరవాణి గారు రాజమౌళి గారికి బ్యాగ్రౌండ్ స్కోరు ఇచ్చినంత రేంజ్ లో మ్యూజిక్ ఉంటుంది. సందీప్ కి భైరవకు అనుబంధం కారణంగా ఇంకా అద్భుతమైన ట్రాక్స్ వచ్చాయి. తన మ్యూజిక్ తో సినిమాని మరో స్థాయికి ఎలివేట్ చేశారు.
హీరోయిన్ సాక్షి గురించి?
-తను చాలా మంచి నటి. సినిమా కోసం సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది. ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ పండితేనే కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాంటి కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. ఈ సినిమా టీం అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగే వర్క్ చేసాము.
సెలబ్రిటీ ప్రీమియర్ షో వేశారు కదా.. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
– అందరికీ చాలా నచ్చింది. శ్రీ విష్ణు గారు సినిమా గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడారు. సాయి రాజేష్ గారు, ఎస్ కే ఎన్ గారు.. ఇలా ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. అందరికీ నచ్చింది. సినిమా గురించి జెన్యూన్ గా అనిపించింది చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది.
ఈ సినిమాలో ఎన్ని గుర్తుండిపోయే సీన్స్ ఉంటాయి?.
ఓవరాల్ గా సినిమా అంతా గుర్తుండిపోతుంది. నేను పర్సనల్ గా ఎంజాయ్ చేసిన సీన్స్ అలాగే ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనుకునే సీన్స్ కొన్ని ఉన్నాయి. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
హార్స్ రైడింగ్ గురించి ?
-ప్రీఇంటర్వెల్ దగ్గర హార్స్ రైడ్ సీక్వెన్స్ ఉంది. అది ఎమోషనల్ సీక్వెన్స్. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను ఆ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఒక యానిమల్ ని తెలుసుకోవడం అనేది సర్ప్రైజింగ్ ప్రాసెస్. నేను యాక్ట్ చేస్తుంటే అది కూడా యాక్ట్ చేస్తుంది. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
మోగ్లీ జర్నీ ఎలా అనిపించింది?
డైరెక్టర్ సందీప్ ,నేను ఈ ప్రయాణంలో చాలా క్లోజ్ అయ్యాం. మా మనసులో ఉన్న మాటలు మాకు తెలిసిపోతాయి. ఈ సినిమా కోసం ఒక రోలర్ కోస్టర్ లాంటి ఎమోషన్స్ ని చూశాం. ఒక యాక్టర్ గా నాకు చాలా అద్భుతమైన కథని తీసుకొచ్చారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.
నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ గారి గురించి?
విశ్వప్రసాద్ గారు నా మొదటి సినిమా బబుల్ గమ్ కి చాలా సపోర్ట్ చేశారు, మోగ్లీ కథ ఆయనకి చాలా నచ్చింది. ఫస్ట్ డే నుంచి ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఎంతో కేర్ తీసుకున్నారు. ఇంత పెద్ద సినిమాలాగా రావడానికి కారణం ఆయనే.
కొత్తగా చేస్తున్న ప్రాజెక్టు గురించి?
రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది. ఇది ఇంటెన్స్ లవ్ స్టోరీ. మరొక ప్రాజెక్టు రొమాంటిక్ కామెడీ. త్వరలోనే ఆ సినిమాల వివరాలను తెలియజేస్తాం.






