Champion: ఛాంపియన్ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది – డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం
స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఛాంపియన్ కథ గురించి ?
-బైరాన్‌పల్లి సంఘటనని కొంచెం ఆధారంగా చేసుకొని ఫిక్షన్ గా చేసిన కథ ఇది.
-బైరాన్‌పల్లి, మైఖేల్ రెండు వేర్వేరు కథలు. బైరాన్‌పల్లి గురించి తీస్తే అది డాక్యుమెంటరీ తరహలో వచ్చే అవకాశం వుంది. ఇప్పుడు జనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ చేసేలా సినిమా తీయాలనుకున్నప్పుడు మైఖేల్ క్యారెక్టర్ ని ఆ ఊర్లో పెడితే ఎలా వుంటుందో అనుకుని, దాన్ని ఫిక్షన్ చేసి చేయడం జరిగింది.
-మైఖేల్ విలయమ్స్ సికింద్రాబాద్ లో పుట్టిపెరిగిన ఫుట్ బబాల్ ప్లేయర్. అతని డ్రీం ఇంగ్లాండ్ వెళ్ళడం. అతని పాయింట్ అఫ్ వ్యూ నుంచి కథ నడుస్తుంది.
ఈ కథ అనుకున్నప్పుడే రోషన్ ని ఊహించుకున్నారా?
2019లో స్వప్న గారికి కదా చెప్పాను. విన్న వెంటనే స్వప్న గారికి చాలా నచ్చింది. అప్పటికి ఇంకా హీరో ఎవరనేది నేను అనుకోలేదు. అప్పుడే కరోనా వచ్చింది. పనులన్నీ ఆగిపోయాయి. ఇందులో హీరో క్యారెక్టర్ ఆంగ్లో ఇండియన్. అలాంటి ఫీచర్స్ ఉండే హీరో ఎవరా అని చూస్తున్నప్పుడు పెళ్లి సందడి రిలీజ్ అయింది. రోషన్ అయితే బాగుంటుందని స్వప్న గారు కూడా అన్నారు. రోషన్ కి కథ చెప్పాను. తనకి కూడా నచ్చింది.
– స్వప్న గారికి కథ నచ్చితే హీరోతో సంబంధం లేకుండా సినిమా చేసేస్తారు. ఒక కొత్త హీరోతో కేవలం స్వప్న గారు కాబట్టే ఈ సినిమా చేయగలిగారు. మరో ప్రొడ్యూసర్ ఇంత ధైర్యంగా చేస్తారని అనుకోను.
మీరు రాసుకున్న క్యారెక్టర్ కి రోషన్ ఎంతవరకు న్యాయం చేశాడు?
-200% న్యాయం చేశాడు. 2021లో రోషన్ కి కథ చెప్పాను. అప్పటినుంచి ఈ సినిమా కోసం తను వెయిట్ చేశాడు. మరో సినిమా చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా తను ఈ సినిమాలోనే ఉన్నాడు. దాదాపు మూడు సంవత్సరాలు ఈ సినిమా కోసం ఆగాడు. ఇప్పుడిప్పుడే పైకి రావాలనుకున్న హీరో ఒక సినిమా కోసం మూడు సంవత్సరాలు ఆగడమనేది మామూలు విషయం కాదు.
-తన మూడు సంవత్సరాల నిరీక్షణకు తగిన ఫలితం ఉంటుందని నమ్మకంగా చెప్పగలుగుతాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రోషన్ ని గుండెల్లో పెట్టుకుంటారు. తన క్యారెక్టర్ మర్చిపోలేరు. అది మాత్రం గ్యారెంటీ. ఈ సినిమా ఫస్ట్ తన కోసం, తర్వాత నిర్మాతల కోసం, ఆ తర్వాత నా కోసం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
అనస్వర రాజన్ గురించి?
రోషన్ ఏజ్ కి మ్యాచ్ అయ్యే హీరోయిన్ కావాలి .అనస్వర యంగ్ హీరోయిన్. అలాగే ఈ క్యారెక్టర్ కి పర్ఫార్మెన్స్ కూడా వచ్చి ఉండాలి. ఇలా అన్ని రకాలుగా రోషన్ కి సరిజోడిని చూస్తున్నప్పుడు తనైతే బాగుంటుందనుకున్నాం తర్వాత లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశాం.
ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ స్వయంగా అనస్వరనే చెప్పింది. పట్టు పట్టి ప్రాక్టీస్ చేసి మరీ చెప్పింది. తను వెరీ డెడికేటెడ్.
దాదాపు 30 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ సినిమాలో నటిస్తున్నారు కదా.. ఆ పాత్ర ఎలా ఉంటుంది?
-కథలో చాలా ముఖ్యమైన పాత్ర. ఒక పెద్దరికం ఉన్న పాత్ర కావాలి. ఇది స్వప్న గారి సజెషన్. వేరే సినిమాలలో కళ్యాణ్ చక్రవర్తి గారిని తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఈ సినిమాకి అలాంటి ఒక మంచి క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు ఆయనని సంప్రదించడం, ఆయన కథ నచ్చి అంగీకరించడం జరిగింది.
అర్చన గారి పాత్ర ఎలా ఉంటుంది?
ఇవన్నీ కూడా బైరాన్ పల్లి విలేజ్ లో వచ్చే పాత్రలు. కళ్యాణ్ చక్రవర్తి గారి భార్య పాత్రలో అర్చన గారు కనిపిస్తారు.
మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ గురించి?
మిక్కి కెరీర్ లో ఇది బెస్ట్ ఆల్బమ్. రకరకాల మ్యూజిక్ జోనర్స్ ఉండే ఆల్బమ్ ఇది. డిఫరెంట్ కంపోజిషన్స్ ఉన్నాయి. అన్ని సాంగ్స్ బ్రహ్మాండంగా ఆడియన్స్ లోకి వెళ్ళాయి. ఈ మధ్యకాలంలో ఒక ఆల్బమ్ లో ఇన్ని హిట్ సాంగ్స్ రాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా చేశారు. నిజానికి మిక్కీ యూఎస్ లోనే ఉంటారు. కానీ ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మ్యూజిక్ చేశారు
ఈ సినిమా విషయంలో డైరెక్టర్ గా మీకు ఛాలెంజింగ్ గా అనిపించినా ఎలిమెంట్స్ ఏమిటి ?
ప్రొడక్షన్ సపోర్ట్ ఉన్నప్పుడు చాలెంజ్ ఏమీ ఉండదు. మది గారు మిక్కీ జే మేయర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఇలా ఒక అద్భుతమైన టీంని ఇచ్చారు. ఎంతో నమ్మకం పెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే రియల్ ఛాలెంజ్.
రోషన్ ఈ సినిమా కోసం ఎలా కష్టపడ్డాడు?
-చాలా సిన్సియర్ యాక్టర్. తన లోపల కష్టపడే తత్వం ఉంది. తన మెచ్యూరిటీ చూస్తే మనకు షాక్ అనిపిస్తది. ఒకసారి కథ విని నచ్చిన తర్వాత మరోసారి ఆలోచించలేదు. తనని చూస్తే నిజంగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది.
తెలంగాణ సాయుధ పోరాటం ఆధారంగా ఇదివరకు కొన్ని సినిమాలు వచ్చాయి కదా.. ఈ సినిమా ఎంత ప్రత్యేకంగా ఉండబోతుంది?
-ఒక హిస్టారికల్ ఈవెంట్ ని సినిమాటిక్ గా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలనే ప్రయత్నం చేశాం. సినిమా చూసిన వాళ్ళు ఇలా జరిగిందని తెలుసుకుంటే మేము చేసిన ప్రయత్నం సఫలమైనట్టే.
-మనం పుట్టిన నేల మీద మనకు తెలియని కథలు చాలా ఉంటాయి. మనం మూలాలు తెలుసుకోవడం ఎప్పుడూ కూడా ఆసక్తికరంగా ఉంటుంది అలాంటి మూలాన్ని, కథని చెప్పాలనుకునే ప్రయత్నం ఇందులో చేశాం.
– సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులు అక్కడ వాళ్ళతో కాసేపు గడిపి, వాళ్లతో నడిచి వాళ్లతో నడిచి, పోరాడి, చివరికి వాళ్లతో పాటు కాసేపు ఏడ్చి ఆ క్యారెక్టర్లన్ని కూడా మనసులో గుర్తుపెట్టుకునేలాగా ఉంటాయి.
ఈ సినిమా నుంచి ఒక దర్శకుడిగా మీరేం నేర్చుకున్నారు?
-నిజానికి చాలా గ్యాప్ తర్వాత సినిమా తీస్తున్నాను. మన సంకల్పం బలంగా ఉంటే అన్నీ కుదురుతాయి అని అంటారు. నా విషయంలో అది నిజంగా జరిగిందని భావిస్తున్నాను. వైజయంతి, స్వప్న సినిమాస్ బ్యానర్లో సినిమా దొరకడం, వాళ్ళు ఈ కథని నమ్మి బడ్జెట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది.
-నిజానికి 2014 తర్వాత కావాలనే కొంత గ్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత కరోనా వచ్చింది. సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ చేసాం. దానికి నేను ఒక షో రన్నర్ ని. అది చాలా విజయవంతమైన వెబ్ సిరీస్
నాగ్ అశ్విన్ గారు సినిమా చూశారా ?
-ఆయన సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చింది. నాగి గారు ఎవరి సినిమాలో ఇన్వాల్వ్ కారు. ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తారు. కావలసినప్పుడు సజెషన్స్ ఇస్తారు.
రామ్ చరణ్ గారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమాని లగాన్ తో పోల్చారు కదా.. ఎలా అనిపించింది ?
-ఆయన అబ్జర్వేషన్ చూసి నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇది హీరో సెంట్రిక్ ఫిలిం కానీ విలేజ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది బైరాన్ పల్లి తో పాటు హీరో కలిసి చేసే ఫైట్. ఆయన ట్రైలర్ చూసి ఆ పోలిక తీసుకురావడం చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది
ఒక దర్శకుడిగా ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏమిటి?
-రిజల్ట్ ని బట్టి ప్లాన్ ఉంటుంది. ఛాంపియన్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను. దర్శకుడిగా నా బలం గురించి చెప్పాలంటే నేను డ్రామాని బాగా హ్యాండిల్ చేయగలను. ఏం చేసినా కూడా డ్రామా బలంగా ఉండేలా కథలు రాసుకుంటాను.






