3 Roses Season 2: “ఆహ ఒర్జినల్స్ త్రీ రోజెస్” సీజన్ 2 మా కెరీర్ లో ఎంతో స్పెషల్ – హర్ష చెముడు
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్”. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో “త్రీ రోజెస్” సీజన్ 2 హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఈషా రెబ్బా, యాక్టర్ హర్ష చెముడు.
హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ
– “త్రీ రోజెస్” సీజన్ 2లో నేను కంటిన్యూ కావడం హ్యాపీగా ఉంది. సీజన్ 1లో ఫీమేల్ క్యారెక్టర్స్ కు వేర్వేరు సీన్స్ ఉంటాయి. ఈ సీజన్ 2లో ఆ క్యారెక్టర్స్ అన్నింటికి కలిపి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. వెకేషన్ కు వెళ్లే సన్నివేశాలు సీన్స్ చేశాం. నేను రాశీ కుషిత మూడు కీ రోల్స్ చేశాం.
– రాశీ ఫైర్ బ్రాండ్ లా ఉంటుంది. కుషిత చిన్న పిల్లలా అల్లరి చేసేది. వీళ్లిద్దరితో కలిసి నటించడం ఎంజాయ్ చేశాను. ఈ సిరీస్ లో గ్లామర్ డోస్ పెంచలేదు. యూత్ ఫ్యామిలీ అంతా కలిసి సిరీస్ చూడొచ్చు. “త్రీ రోజెస్” సీజన్ 2లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల నిడివితో సాగుతుంది. “త్రీ రోజెస్” సీజన్ 3కి లీడ్ ఇస్తూ సీజన్ 2 కంప్లీట్ అవుతుంది.
– నేను హర్ష చేసిన సీన్స్ అంత వైరల్ అవుతాయని మేము సీజన్ 1 చేసేప్పుడు అనుకోలేదు. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో నటించాం. సీజన్ 1లో మా పెయిర్ కు వచ్చిన రెస్పాన్స్ తో సీజన్ 2లో ఇంకా బాగా కాన్ఫిడెంట్ గా చేశాం. “త్రీ రోజెస్” వెబ్ సిరీస్ అనేది మా కెరీర్ లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది. ఈ సిరీస్ కు వర్క్ చేయడాన్ని మేమంతా ఎంజాయ్ చేశాం.
– హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉండే మూవీస్ గతంలో చాలా తక్కువగా వచ్చేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ఫీమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ వస్తే నన్ను నేను అందులో రిలేట్ చేసుకోగలిగితే నటించేందుకు ఒప్పుకుంటా. నేను లాక్ డౌన్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. యాక్షన్ మూవీస్ లో అవకాశం వస్తే నటిస్తా.
– గర్ల్స్ అంతా కలిసి ఒక దగ్గర రెంట్ కు ఉండటం, వాళ్లు కలిసి సరదాగా కుకింగ్, గాసిప్స్ చెప్పుకోవడం, లైఫ్ లీడ్ చేయడం అనేది ఈ సీజన్ 2లో నేను పర్సనల్ గా బాగా కనెక్ట్ అయిన పాయింట్. గతంలో మా గర్ల్స్ గ్యాంగ్ లో నేను కూడా అలా ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి: సినిమా సంక్రాంతి అయ్యాక జనవరి 23న రిలీజ్ చేస్తున్నారు. సినిమా అప్పటికే కంప్లీట్ అయి ఉన్నా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమిళంలో ఒక మూవీ చేస్తున్నా. మా మదర్ వాళ్లది రాజమండ్రి, మా నాన్నది వరంగల్ కాబట్టి సంక్రాంతికి ఏపీకి వెళ్తా, అలాగే ఇక్కడ పండుగలకు వరంగల్ వెళ్తుంటా.
యాక్టర్ హర్ష చెముడు మాట్లాడుతూ
– “త్రీ రోజెస్” సీజన్ 1 కంటే సీజన్ 2 స్కేల్ పరంగా చాలా పెద్దది. మొదటి సీజన్ చేసినప్పుడు తక్కువ బడ్జెట్ లో చేశారు. ఆ సీజన్ హిట్ అయ్యింది కాబట్టి సీజన్ 2 ఇంకా హ్యూజ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కువమంది ఆర్టిస్టులను పెట్టుకుని రూపొందించారు.
– ఇందులో కొన్ని అతిథి పాత్రలు కూడా వస్తుంటాయి. “త్రీ రోజెస్” సీజన్ 1 లోని రివేంజ్ ను ఈ సీజన్ 2 లో తీర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తుంటాను. ఈషా, నా క్యారెక్టర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి. మన తెలుగు వెబ్ సిరీస్ లకు చూసుకుంటే ఇది పక్కా సీక్వెల్.
– వెబ్ సిరీస్ లలో కొన్నింటికి ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో డైరెక్టర్ ఉంటారు. మా సీజన్ 2కు కొత్త డైరెక్టర్ కిరణ్ వర్క్ చేశారు. అయితే రైటర్ అండ్ టీమ్ మారలేదు కాబట్టి అందరూ కోఆర్డినేషన్ తోనే చేసుకున్నారు. సిరీస్ అంతా ఎంటర్ టైనింగ్ గా సరదాగా ఉంటుంది. లైఫ్, రిలేషన్ షిప్స్, ఫ్రెండ్ షిప్ గురించి మంచి విషయాలు కూడా ఉంటాయి. అయితే అవి సందేశాలు ఇచ్చినట్లు చూపించలేదు.
– మాతో పాటు సుదర్శన్, సత్య, ప్రభాస్ శ్రీను గారు..ఇలా చాలా మంది మంచి కాస్టింగ్ ఉన్నారు. పేరు వచ్చే దాకా యాక్టర్ గా స్ట్రగుల్ అవుతాం. ఇప్పుడు సెలెక్టివ్ గా మూవీస్ చేయగలుగుతున్నా. క్యారెక్టర్ బాగుంటే లీడ్ క్యారెక్టర్ , చిన్న క్యారెక్టర్ అనే తేడాలు చూడను. సాయి రాజేశ్ గారి ప్రొడక్షన్ లో ఒక మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా. ప్రభాస్ గారి రాజా సాబ్ లోనూ ఒక రోల్ చేశా. కీలకమైన సన్నివేశంలో నా పాత్ర ఉంటుంది.
– మారుతి గారు సిరీస్ ను బాగా గైడ్ చేశారు. ఎస్ కేఎన్ గారు ప్రతి రోజూ సెట్ లో ఉండి ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకునేవారు. వారిద్దరి వల్లే త్రీ రోజెస్ సీజన్ 2 ఇంత గ్రాండ్ కాన్వాస్ లో రాబోతోంది. సుందరం మాస్టార్ కోవిడ్ టైమ్ లో రిలీజ్ అయ్యింది. అప్పటికి ప్రొడ్యూసర్స్ పై ఉన్న ఒత్తిడి వల్ల సరైన సీజన్ లో రిలీజ్ చేయలేకపోయారు. ఫలానా హీరోతో పనిచేయాలి అనే లిస్టు చాలా పెద్దది. అందరితో వర్క్ చేయాలని ఉంది.
– ఈ సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాల్లో నటించా. రోజూ వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో ఉండాలనేది నా కోరిక. నన్ను కామెడీతో పాటు మిగతా ఎమోషన్స్ చేయగలను అని నమ్మే ఈ సిరీస్ లో అవకాశం కల్పించారు. బకాసుర అనే మూవీ చేశా. అందులోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించా. మోగ్లీలో కొత్త పాత్రలో కనిపిస్తా. ఒక్కో టైమ్ లో ఇండస్ట్రీలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఫన్ ట్రెండ్ నడుస్తోంది. ఎంటర్ టైనింగ్ మూవీస్ బాగా చూస్తున్నారు. కొన్నాళ్లకు మరో ట్రెండ్ వస్తుంది.
-Varma






