ఇక చాట్బాట్ల రోజులు ముగిశాయి.. రాబోయే మూడేళ్లలో ప్రపంచానికి ‘ఏఐ’ ముప్పు..!
ప్రస్తుతం మనం వాడుతున్న చాట్‌జీపీటీ, జెమిని, క్లాడ్, గ్రోక్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ ఈమెయిల్స్ రాయడానికి, డేటా విశ్లేషించడానికి లేదా ట్రావెల్ ప్లానింగ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఇవన్నీ కేవలం ఒక చిన్న ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు భయంకరమైన (AI Danger) సినిమా ముందుందని గూగుల్ ఎక్స్ (Google X) మాజీ బిజినెస్ చీఫ్ మో గౌడెట్ హెచ్చరించారు. మానవాళికి కేవలం మరో మూడేళ్ల సమయం మాత్రమే ఉందని, 2027 నాటికి రాబోయే మార్పులు మానవ సమాజ నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
2027 నాటికి ఏజీఐ.. అదే పెద్ద షాక్!
‘ది డైరీ ఆఫ్ ఏ సీఈఓ’ పాడ్‌కాస్ట్‌లో మో గౌడెట్ మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) పూర్తిస్థాయిలో వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏజీఐ అంటే మనుషులతో సమానంగా లేదా అంతకంటే అత్యంత ప్రతిభావంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల శక్తివంతమైన ఏఐ వ్యవస్థ (AI Danger). ఇది కేవలం అడిగిన దానికి సమాధానాలు ఇచ్చే సాధారణ చాట్‌బాట్ లాంటిది కాదు. ప్రస్తుతం అంతర్జాతీయ ల్యాబ్‌లలో జరుగుతున్న పరిశోధనల ప్రకారం, ఏఐ వ్యవస్థలు తమ సొంత కోడ్‌ను తామే సరిచేసుకుంటూ, కొత్త సామర్థ్యాలను మనుషుల ప్రమేయం లేకుండానే చాలా వేగంగా నేర్చుకుంటున్నాయి. మన అవగాహనకు, ఏఐ నిజమైన శక్తులకు మధ్య ఉన్న ఈ పెద్ద అంతరమే భవిష్యత్తులో ప్రపంచానికి కోలుకోలేని షాక్ ఇవ్వబోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసలు సవాలు ఏఐ (AI Danger) సాంకేతికత కాదు.. దాని వెనుక ఉన్న శక్తివంతమైన సంస్థలు, ప్రభుత్వాలేనని ఆయన గుర్తు చేశారు.
మొదటి దెబ్బ వైట్-కాలర్ ఉద్యోగాలకే!
ఈ ఏఐ విప్లవం (AI Danger) వల్ల ఉద్యోగాల మార్కెట్లో తీవ్రమైన కుదుపులు రానున్నాయి. ముఖ్యంగా ఆఫీసుల్లో కూర్చుని సాంకేతిక పనులు చేసే ‘వైట్ కాలర్’ ఉద్యోగాలకే మొదటి ముప్పు పొంచి ఉందని గౌడెట్ విశ్లేషించారు. కాల్ సెంటర్ సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, పారాలీగల్స్, ఫైనాన్షియల్ అనలిస్టులు, గ్రాఫిక్ డిజైనర్లు, ట్రావెల్ ఏజెంట్ల పనులను ఏఐ చాలావరకు తగ్గించగలదు. అయితే ఈ మార్పు ఒక్కసారిగా అందరినీ కంపెనీల నుంచి తీసేయడం ద్వారా జరగదు. కంపెనీలు ముందుగా కొత్త నియామకాలను (Hiring) పూర్తిగా నిలిపివేస్తాయి. ఇప్పటికే చాలా అంతర్జాతీయ సంస్థలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను ఏఐ వ్యవస్థలకే అప్పగిస్తూ కొత్తవారిని తీసుకోవడం తగ్గించాయి. దీర్ఘకాలంలో రోబోటిక్స్ కూడా తోడైతే శారీరక శ్రమతో కూడిన రంగాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఏఐతో పోటీ వద్దు.. కలిసి సాగండి!
అయితే ఏఐ భవిష్యత్తు పూర్తిగా ప్రమాదకరమని (AI Danger) తాను భావించడం లేదని గౌడెట్ అన్నారు. అధునాతన ఏఐ వల్ల వైద్యం, విద్య, శాస్త్రీయ పరిశోధనలు, ఇంధన రంగాల్లో విప్లవాత్మకమైన పరిష్కారాలు లభిస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ కొత్త డిజిటల్ ప్రపంచంలో యువత మనుగడ సాగించాలంటే ఏఐతో పోటీ పడటం మానేసి, దానిని ఒక సాధనంగా వాడుకుంటూ కలిసి పనిచేయడం నేర్చుకోవాలని సూచించారు. సృజనాత్మకత, సానుభూతి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మానవ సంబంధాలను నిర్మించుకోవడం వంటి లక్షణాలు యంత్రాలకు అస్సలు రావు. భవిష్యత్తులో ఈ మానవీయ గుణాలే యువతకు అత్యంత విలువైన ఆస్తులుగా మారతాయని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి








