గుంటూరులో లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• దశాబ్దాలుగా వైద్యం రంగంలో లలితా గ్రూప్ ఉంది. గుంటూరులో ఇలాంటి అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషకరం.
• సౌత్ ఇండియాలోనే మొదటి సారి ఆధునిక ఎమ్ఆర్ఐ స్కాన్ ఇక్కడికి తీసుకొచ్చారు.
• 1995లో నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు, ఇతర చిన్న ఆసుపత్రులు హైదరాబాద్లో ఉండేవి. నాడు హైదరాబాద్ లో హెల్త్ టూరిజాన్ని ప్రమోట్ చేశాం. దేశంలో ఎక్కడి నుంచైనా ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.
• రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని రోగులు అమరావతి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు
• 15 లక్షల పేషెంట్లకు ఈ ఆసుపత్రి ట్రీట్మెంట్ ఇచ్చింది. బ్రాండ్ ఎస్టిబ్లిష్ చేస్తే దానికి తిరుగుండదనడానికి లలితా హాస్పిటల్ ఒక నిదర్శనం
• విలువలు లేకపోతే లాజికల్ గా తీసుకెళ్లలేం. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత కలగాలి.. అప్పుడే ఏ వ్యవస్థకైనా మనుగడ.
• ఏడు ఎకరాల్లో 600 పడకలతో ఈ లలితా ఆసుపత్రి ఏర్పాటైంది. 32 విభాగాలు సేవలందించే ఏకైక సెంటర్. కార్డియాలిజీ, న్యూరీలజీ, జాయింట్ రీప్లేస్మెంట్ వంటి సేవలను ఇక్కడ అందిస్తారు.
• ల్యాండ్ మార్క్ ఇనిస్టిట్యూట్ గా లలితా ఆసుపత్రి మారుతుంది.
• మనిషికి ఆరోగ్యానికి మించి ఆస్తి ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే నిజమైన ధనవంతుడు
• వేల కోట్లు ఉన్నా, ప్యాలెస్ లు ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు.
• హెల్తీ సిటిజన్సే వెల్తీ నేషన్ నిర్మిస్తారు
• మేం సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రాం.
• మంత్రి కూడా ప్రజలకు మెరుగైన వైద్యం కోసం పని చేస్తున్నారు.
• డిజిటల్ హెల్త్ రికార్డులు తీసుకొస్తున్నాం. ప్రపంచంలోని నాలెడ్జ్ ను, బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటిదగ్గరే అందించేలా సంజీవని పని చేస్తుంది.
• ప్రిడెక్టివ్, ప్రెవెంటివ్, క్యూరేటివ్ విధానాన్ని అమలు చేస్తున్నాం. 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గరే చేస్తాం.
• ఏ మందులు వేసుకోవాలి, ఎప్పుడు ఆసుపత్రులకు రావాలో సంజీవని ద్వారా చెప్తారు.
• యూనివర్సిల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. రూ.2.5 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తాం.
• ప్రజలు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దు.
• తినే తిండి, మన పరిసరాలు, మన ఆలోచనా విధానం చాలా ముఖ్యం. ప్రభుత్వం ఎన్ని వైద్య సేవలు తెచ్చినా, ఆసుపత్రులు కట్టినా ప్రజలు మద్దతు లేకుంటే సాధ్యం కాదు.
• మంచి అలవాట్లు, ఆహారం, వ్యాయామం ఆరోగ్యానికి పనికొస్తాయి.
• యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రాణాయామంకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం.
• ఫుడ్ మెడిసిన్…కిచెన్ ఫార్మసీ. మనం తినే ఆహారమే మనల్ని రక్షిస్తుంది.
• ఒకప్పుడు కావాల్సిన పంటలు ఎరువులు లేకుండా పండించారు. కానీ ఈ రోజు మొత్తం యూరియా వాడుతున్న ఆహారం తీసుకుంటున్నాం.
• తెలిసీ తెలియక ఎక్కువగా క్రిమీ సంహారక మందులు వాడుతున్నారు.
• గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం కారణంగా చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ప్రజల జీవితాలతో చెలగాటమాడారు.









