పెట్రోల్ రేట్లు తగ్గుతాయనుకుంటే… 48 గంటల్లోనే ఊహించని ట్విస్ట్! అసలేం జరుగుతోంది?
–శివ దువ్వూరు
“పెట్రోల్ ధరలు తగ్గుతాయట…”
“హోర్ముజ్ మళ్లీ తెరుచుకుందట…”
అని ప్రపంచం ఊపిరి పీల్చుకునేలోపే… 48 గంటల్లోనే కథ అడ్డం తిరిగింది! అమెరికా “హోర్ముజ్ తెరిచి ఉంది” అంటోంది. ఇరాన్ “మళ్లీ మూసేశాం” అంటోంది. నౌకలు మాత్రం… “మేము ఇంకా భయపడుతున్నాం” అంటున్నాయి. ఇంతకీ నిజం ఏంటి? హోర్ముజ్ తెరిచి ఉందా?మూసి ఉందా? ఏదైమైనా ప్రపంచ చమురు మార్కెట్ మొత్తం ఒక పెద్ద గందరగోళంలో పడిపోయింది.
ప్రపంచ పెట్రోల్ ట్యాప్… ఇప్పుడు ఎవరి చేతిలో?
మన ఇంట్లో నీటి ట్యాంక్‌కు మెయిన్ వాల్వ్ ఉన్నట్లే… ప్రపంచ చమురుకు ఉంది. ఆ వాల్వ్ పేరు హోర్ముజ్ జలసంధి. ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా వెళ్లే చమురులో దాదాపు నాలుగో వంతు… LNGలో ఐదో వంతు…ఈ ఒక్క మార్గం గుండా వెళ్తాయి. అందుకే హోర్ముజ్‌లో చిన్న అలజడి వచ్చినా… ప్రపంచ మార్కెట్లు గజగజ వణుకుతాయి. పెట్రోల్ బంక్ వద్ద నిలబడ్డ సామాన్యుడి జేబు కూడా వణుకుతుంది.
“తెరిచాం” అన్న అమెరికా… “మూసేశాం” అన్న ఇరాన్!
జూన్ 17న అమెరికా-ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. 60 రోజుల పాటు హోర్ముజ్ తెరవాలి… ఇరాన్ చమురుపై ఆంక్షలు సడలించాలి… మళ్లీ అణు చర్చలు మొదలుపెట్టాలి… అని నిర్ణయించారు. ప్రపంచం అంతా… “హమ్మయ్య… సంక్షోభం ముగిసింది” అనుకుంది. కానీ ఆ సంతోషం రెండురోజులే నిలిచింది. ఇజ్రాయెల్-లెబనాన్ ఉద్రిక్తతలను చూపిస్తూ… ఇరాన్ మళ్లీ హోర్ముజ్ మూసేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలైంది. రోడ్డు తెరిచి ఉంది… కానీ ఎవరూ వెళ్లడం లేదు!
ఇవి కూడా చదవండి
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాంకేతికంగా చూస్తే… కొన్ని నౌకలు వెళ్తున్నాయి. అమెరికా నౌకాదళం సహకారంతో ట్రాఫిక్ కదులుతోంది. కానీ వ్యాపార ప్రపంచం మాత్రం వేరే మాట చెబుతోంది. ఎందుకంటే… రోడ్డు తెరిచి ఉండటం ఎంత ప్రధానమో… ఆ రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడం మరింత ప్రధానం. హోర్ముజ్ పరిస్థితి కూడా అదే.
8 రెట్లు పెరిగిన భయం… 8 రెట్లు పెరిగిన ఇన్సూరెన్స్!
యుద్ధం తగ్గినా… భయం తగ్గలేదు. నౌకలకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ ఇప్పుడు సాధారణం కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ. ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్ దిగ్గజాలు… ఇంకా హోర్ముజ్ మార్గాన్ని పూర్తిగా నమ్మడం లేదు. అందుకే చాలావరకు నౌకలు వేల కిలోమీటర్లు అదనంగా తిరుగుతూ… ఆఫ్రికా చుట్టూ ప్రయాణిస్తున్నాయి. అంటే… హోర్ముజ్ “ఓపెన్” అయినా… వ్యాపార ప్రపంచానికి అది ఇంకా “రిస్క్ జోన్”గానే కనిపిస్తోంది.
భారత్ సైలెంట్ మాస్టర్‌స్ట్రోక్!
యుద్ధం మొదలైనప్పుడు చాలా మందికి ఒక భయం. “భారత్‌కు చమురు కొరత వస్తుందా?” “పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయా?” కానీ భారత్ ముందే ప్లాన్-B సిద్ధం చేసుకుంది. రష్యా నుంచి… బ్రెజిల్ నుంచి… అమెరికా నుంచి… పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి… ప్రత్యామ్నాయ చమురు కొనుగోళ్లు పెంచింది.దాంతో ఇప్పుడు హోర్ముజ్‌లో గందరగోళం కొనసాగుతున్నా… భారత్‌పై ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
పెట్రోల్ ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా?
ఇదే అందరి ప్రశ్న. ప్రస్తుతం మార్కెట్లు కొంత రిలీఫ్ చూపించాయి. చమురు ధరలు తగ్గాయి. కానీ అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉంది. హోర్ముజ్‌లో నౌకలు… ఎలాంటి దాడులు లేకుండా… ఎలాంటి ఆంక్షలు లేకుండా… సాధారణంగా నెలల తరబడి ప్రయాణించగలిగితేనే… ప్రపంచం “సంక్షోభం ముగిసింది” అని నమ్ముతుంది. అంతవరకు పెట్రోల్ మార్కెట్‌పై టెన్షన్ నీడలు పూర్తిగా తొలగిపోవు.
కాబట్టి…
హోర్ముజ్ తెరిచిందా? మూసిందా? అనే ప్రశ్న ఇప్పుడు చిన్నదైపోయింది. ప్రపంచం అడుగుతున్న అసలు ప్రశ్న ఒక్కటే… “నౌకలు భయంలేకుండా, సాధారణంగా, బీమా సమస్యలు లేకుండా తిరుగుతున్నాయా?” ఆ ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. అందుకే… 48 గంటల రిలీఫ్ తర్వాత కూడా…ప్రపంచ చమురు మార్కెట్ ఇంకా అప్రమత్తంగానే ఉంది. పెట్రోల్ బంక్ వద్ద నిలబడ్డ మనిషి కూడా. మరి మీరేమంటారు?
హోర్ముజ్ తెరిచిందా? మూసిందా? అనే ప్రశ్న ఇప్పుడు చిన్నదైపోయింది. ప్రపంచం అడుగుతున్న అసలు ప్రశ్న ఒక్కటే… “నౌకలు భయంలేకుండా, సాధారణంగా, బీమా సమస్యలు లేకుండా తిరుగుతున్నాయా?” ఆ ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. అందుకే… 48 గంటల రిలీఫ్ తర్వాత కూడా…ప్రపంచ చమురు మార్కెట్ ఇంకా అప్రమత్తంగానే ఉంది. పెట్రోల్ బంక్ వద్ద నిలబడ్డ మనిషి కూడా. మరి మీరేమంటారు?








