Attapur: అత్తాపూర్‌లో నూతన షోరూమ్‌ని ప్రారంభించిన మలబార్ గోల్డ్&డైమండ్స్
హైదరాబాద్: ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల వర్తక సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో తమ కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ కు అతి ముఖ్యమైన మార్కెట్లలో ఒకటైన హైదరాబాద్‌లో బ్రాండ్ కు ఇది 17వ షోరూమ్ కాగా తెలంగాణలో సంస్థకు 25వ షోరూమ్ గా నిలుస్తోంది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ బలమైన ప్రాంతీయ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ కొనసాగుతోంది. ఆభరణాల యాజమాన్యం పరంగా లోతుగా పాతుకుపోయిన సంస్కృతి, వివాహ ఆభరణాలకు స్థిరంగా కనిపించే డిమాండ్ , నగరం యొక్క స్థిరమైన నివాస, ఆర్థిక వృద్ధి దీనికి మద్దతు ఇస్తుంది. ఈ షోరూమ్‌ను హీరోయిన్ శ్రీనిధి శెట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, అత్తాపూర్ కార్పొరేటర్ ఎం. సంగీత, మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిర్వహణ బృందం సీనియర్ సభ్యులు రెస్ట్ ఆఫ్ ఇండియా రిటైల్ హెడ్ సిరాజ్ పి. కె, హైదరాబాద్ జోన్ జోనల్ హెడ్ షరీజ్ కె, తెలంగాణ జోన్ జోనల్ హెడ్ శ్రీ షానిబ్ తదితరులు పాల్గొన్నారు.
మరింత చేరువ..
మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం. పి. అహ్మద్ మాట్లాడుతూ, “హైదరాబాద్ గత కొద్ది ఏళ్లుగా మలబార్‌కు స్థిరంగా బలమైన, ప్రోత్సాహకరమైన మార్కెట్‌గా నిలుస్తోంది. అత్తాపూర్‌లోని మా కొత్త షోరూమ్, నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోని వినియోగదారులకు మలబార్ అనుభవాన్ని మరింత చేరువ చేయాలనే మా ప్రయత్నంలో భాగం. మా కార్యకలాపాలను విస్తరిస్తున్న కొద్దీ, బాధ్యతాయుతమైన, నైతిక వ్యాపార ప్రక్రియల మద్దతుతో విస్తృత శ్రేణి అవకాశాలు , పారదర్శక ధర, నమ్మకమైన నాణ్యతను అందించడంపై మా దృష్టి కొనసాగుతుంది” అని పేర్కొన్నారు.






