రష్యాకు జో బైడెన్ సూచన.. అతని వెంటనే విడుదల
అరెస్టు చేసిన వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు ఇవాన్ గెర్ష్కోవిక్ను వెంటనే విడుదల చేయాలని రష్యాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. అమెరికా పౌరుడైన గెర్ష్ కోవిక్ గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ రష్యా నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ స్పందించారు. అతడిని విడిచి పెట్టండంటూ రష్యాకు బైడెన్ సూచించారు. జర్నలిస్టు అరెస్టుపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని మేం సహించబోం. తీవ్రంగా ఖండిస్తున్నాం అని ప్రస్తుతం ఆఫ్రికాలోని జాంబియాలో పర్యటిస్తున్న ఆమె స్పష్టం చేశారు.






