శత్రు దేశంకు వార్నింగ్ ఇచ్చిన… అమెరికా అధ్యక్షుడు

తొలి విదేశీ పర్యటన మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శత్రు దేశం రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ రష్యా ఏదైనా హానికర కార్యకలాపాలకు పాల్పడితే, అప్పుడు ఆ దేశం దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్ అన్నారు. మిత్రదేశాలతో బంధాల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశాన్ని బైడెన్ వినిపించారు. బ్రిటన్ చేరుకున్న బైడెన్ ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‍ను కలవనున్నారు. ఇక జెనీవాలో జరిగే ఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‍తోనూ జో బైడెన్ భేటీ కానున్నారు. రష్యాకు సంబంధించిన ఆయుధ నియంత్రణ, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‍లో రష్యా జోక్యం, సైబర్ హ్యాకింగ్, నవాల్నీ జైలు శిక్ష లాంటి అంశాలపై బైడెన్ ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. యూరోప్ దేశాల్లో 8 రోజుల పాటు బైడెన్ పర్యటించనున్నారు.