యూఎస్ ఓపెన్ కు రఫెల్ నాదల్ దూరం

డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగాడు. కరోనానే అందుకు కారణమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. కొవిడ్ 19 ఇంకా నియంత్రణలోకి రాలేదు. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. యుఎస్ ఓపెన్‍కు దూరమవ్వాలని ఎప్పుడూ అనుకోను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం చేయకపోవడమే ఉత్తమం అనుకుంటున్నా అని నాదల్ చెప్పాడు. ఫెదరర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‍స్లామ్ టైటిళ్ల రికార్డు (20)కు నాదల్ ఒక్క టైటిల్ దూరంలో ఉన్నాడు. 1999 తర్వాత ఫెదరర్ లేదా నాదల్ లేకుండా జరుగుతున్న తొలి గ్రాండ్‍స్లామ్ టోర్నీ ఇదే.