తేరుకున్న న్యూయార్క్…సడలింపులు షురు

అమెరికాలో అత్యధిక కోవిడ్ 19 కేసులు న్యూయార్క్లోనే నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 23,49,884 కరోనా కేసులు నమోదైతే.. ఇందులో 4,11,009 కేసులు ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో మ•తదేహాలను పూడ్చడానికి కూడా స్థలం దొరకలేదంటే న్యూయార్క్లో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు న్యూయార్క్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. న్యూయార్క్ నగరంలో కూడా కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గడంతో లాక్‍డౌన్‍లో సడలింపులు ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా సడలింపులు ఇచ్చిన తరువాత కూడా కేసులు భారీగా పెరగకపోవడంతో ఇప్పుడు రెండో విడత సడలింపులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఒక శాతం కంటే తక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. కరోనా మహమ్మారితో పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉందని.. జాగ్రత్తలు తీసుకుంటూనే న్యూయార్క్లో సడలింపులు ఇచ్చుకుంటూ వెళ్తామని ఆయన చెప్పారు. కాగా.. సోమవారం నుంచి న్యూయార్క్ నగరంలో రెండో విడత సడలింపులు ఇవ్వనున్నారు.