గవర్నర్ తో యెడ్యూరప్ప భేటీ
బీజేపీ నాయకుడు యెడ్యూరప్ప గవర్నర్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంతి అనంతకుమార్ తో కలిసి ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. కర్నాటకీయం రాజ్ భవన్ కు మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని నేపథ్యంలో ఇప్పుడు రాజకీయం అంతా రాజ్ భవన్ చుట్టూ కేంద్రీకృతమైంది. ఇటు ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపి, అటూ కాంగ్రెస్, జేడీఎస్ లు తమ కూటమకే మెజారిటీ ఉంది కనుక ప్రభుత్వ ఏర్పాటుకు ముందు తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో బంతి గవర్నర్ కోర్టులో ఉంది. కాగా ఏకైక అతి పెద్ద పార్టీ అయిన తమకే మంత్రి వర్గ ఏర్పాటుకు తొలుత అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి కిందట యెడ్యూరప్ప గవర్న్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరారు.













