నిన్న ఆజాద్…నేడు ఏచూరి
బక్రీద్‌ను పురస్కరించుకొని జమ్ముకశ్మీర్‌లో కేంద్రం నిషేధాజ్ఞాలను సడలించాలని భావిస్తోంది. అయిత ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోకి రాజకీయ నేతల ప్రవేశాన్ని మాత్రం అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లో తమ పార్టీ కార్యకర్తలతో సమావేశమవడానికి వచ్చిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాలతో వారిని నగరంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్‌ను కూడా నిన్న శ్రీనగర్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.













