అబ్బూరి ఛాయాదేవి ఇకలేరు
ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె కోరిక మేరకు పార్థివదేహాన్ని ఈఎస్ఐ మెడికల్ కళాశాలకు, కండ్లను ఎల్వీ ప్రసాద్ దవాఖానకు అప్పగించారు. రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. తెలుగు సాహిత్యానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.ఛాయదేవి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పలువురు సాహితీవేత్తలు కూడా ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.













