ఈ చేప ధర 13 కోట్లు
ఎర్రని మచ్చలతో ఆకర్షిస్తోంది కదూ ఈ చేప. ప్రపంచంలోనే ఈ మత్స్యం అత్యంత ఖరీదైనది. దీని వెల రూ.13,54,04,340. ఈ చేప పొడవు 3 అడుగుల 3 అంగుళాలు. జపాన్‌లోని హిరోషిమ నగరంలో ఈ చేపకు వేలంపాట నిర్వహించారు. తైవాన్‌కు చెందిన యింగ్యింగ్ అనే మహిళ దీనిని దక్కించుకుంది. అరుదైన జాతులకు చెందిన, భిన్నంగా ఉండే చేపలను సేకరించడం అమె అలవాటు. ఈ మత్స్యాని ఎస్ లెజెండ్‌గా పిలుస్తారు. ఇవి కొహాకు రకానికి చెందినవి. ప్రపంచంలోని అత్యంత గుర్తింపు పొందిన రకాల్లో కొహాకు కూడా ఒకటి. ఈ రకం చేపలు 5 లక్షల వరకు గుడ్లు పెట్టగలవు. అయితే వాటిలో ఐదువేల వరకు నాణ్యమైనవి ఉంటాయి.













