రాష్ట్రపతి భవన్ కార్మికుడికి సోకిన కరోనా
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడికి కరోనా పాజిటివ్ రావడంతో సుమారు వందమందిని అధికారులు క్వారంటైన్ చేసినట్టు తెలుస్తోంది. అధికారులతోపాటు వారి కుటుంబ సభ్యులందరినీ సెల్ఫ్ హోం క్వారంటైన్లో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించగా, కార్మికులను మాత్రం సెంట్రల్ ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. అయితే, పరీక్షల్లో వీరందరికీ నెగటివ్ అని రిపోర్టులు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితమే ఆపారిశుద్ధ్య కార్మికుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సమాచారం.













