ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కశ్మీర్లో పరిస్థితులపై లోక్సభలో కాంగ్రెస్, మహారాష్ట్రలో వర్సాలకు నష్టపోయిన పంటపై శివసేన, కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంపై టీఎంసీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. దివంగత నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, జగన్నాథ్ మిశ్రా, కోడెల శివప్రసాద్, రాంజెఠ్మలానీ, గురుదాస్ దాస్ గుప్తా, ఎస్ లిబ్రాలకు పార్లమెంట్ ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి.













