ప్రధాని మోదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా? ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. పూరీ లోక్సభ స్థానానికి మోదీ పోటీ చేసేందుకు 90 శాతం అవకాశాలు ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత ప్రదీప్ పురోహిత్ పేర్కొన్నారు. పూరీతో మోదీకి ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజలపై మోదీ ప్రేమ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. మోదీ ఎక్కడి నుంచి పోటీ చేసే విషయంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.













