మోదీ ర్యాలీల ఖర్చు ఎంత?
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ డబ్బులు పంచుతున్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ర్యాలీలకు అవుతున్న ఖర్చు గురించి ఎన్నికల కమిషన్ను వివరణ కోరుతున్నామని ఆమె స్పష్టం చేశారు. వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన మోదీ అనేక అంశాలకు సంబంధించి ‘నాకేమీ తెలియవు’ అని జవాబు ఇచ్చారని, దీని కారణంగా ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో అనేక చోట్ల జరిగిన ర్యాలీల్లో మాట్లాడిన మమతా బెనర్జీ ‘ప్రధాని మోదీ ర్యాలీలకు అవుతున్న ఖర్చు గురించి ఎన్నికల కమిషన్ ఆరా తీయాలి’ అని డిమాండ్ చేశారు.













