వాజ్ పేయి ఎందుకు వివాహం చేసుకోలేదు?
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బ్రహ్మచారిగానే ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన వాజ్పేయీ బ్రహ్మచారిగానే కనుమరుగైపోయారు. ఓ సందర్భంలో మీరు వివాహం ఎందుకు చేసుకోరు? అని మీడియా వాళ్లు అడగ్గా, నాకు వివాహం చేసుకునేంత సమయం లేదు. బాధ్యతలు లేని జీవితం గడుపుతున్నా అని కవితాత్మక ధోరణిలో వాజ్పేయీ జావాభిచ్చారు. వాజ్పేయీ వివాహం చేసుకోకపోవడానికి రాజకీయ పండితులు మరో కారణం కూడా చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్లో ప్రచారక్గా పని చేసిన ఆయన, పనినే దైవంగా భావించేవారట. వివాహం చేసుకుంటే ప్రచాకర్గా తన విధులను సరిగా నిర్వర్తించలేనేమోనని భావించే వాజ్పేయీ పెళ్లి చేసుకోలేదని పేర్కొంటున్నారు. ఒక సందర్భంలో మీరు ఎందుకు వివాహం చేసుకోలేదని అడిగితే నాకు తగిన అమ్మాయి దొరకలేదు అని నవ్వూతూ సమాధానం ఇచ్చారట.













