చెస్ ఛాంపియన్షిప్ విజేతగా ఆనంద్
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచి ఆనంద్ తన సత్తా చాటుకున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆయన ఈ టైటిల్‌ని తిరిగి కైవసం చేసుకున్నారు. 2003లో ఆయన ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగాన నిలిచారు. మళ్లీ ఇప్పుడు రియాద్‌లో జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌ని ఆనంద్ ఓడించి, ఆ తర్వాత రష్యా క్రీడాకారుడు వ్లాదిమిర్ ఫెదోసీవ్తో జరిగిన ఫైనల్లో గెలిచి, ఆనంద్ టైటిల్ సాధించారు. తాను విజయం సాధించిన తర్వాత తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆనంద్ ట్వీట్ చేశారు. ఆనంద్ విజయాన్ని ప్రశంసిస్తూ రాష్ట్రపతి కూడా ట్వీట్ చేశారు.













