మాన్సూన్ సేల్ ప్రకటించిన విస్తారా
ఎయిర్‌లైన్ కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడి సమ్మర్ సేల్ అంటూ ఇప్పటివరకూ హడావిడి చేశాయి. తాజాగా మాన్సూన్ సేల్ అంటూ మళ్లీ కొత్త స్కీంలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. విస్తారా కూడా గ్రేట్ మాన్సూన్ సేల్ అంటూ ఐదు రోజుల పాటు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్ అన్నీ ఎకనమీ క్లాస్, వన్‌వే టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణాన్ని జూన్ 28 నుంచి సెప్టెంబర్ 20 మధ్యలో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం ఎకనమీ క్లాస్ టిక్కెట్ రూ.2,099లకు అందిస్తున్నట్లు కంపెనీ వెబ్సైట్లో సమాచారం ఉంది. ఈ టిక్కెట్లు జూన్ 13 నుంచి జూలై 17 అర్థరాత్రి వరకు అమల్లో ఉంటుంది. ఈ ప్రత్యేక ధరల స్కీమ్ గోవా, పోర్టుబెయిర్, లే (లడక్), జమ్ము, శ్రీనగర్, గువాహతి, అమృత్సర్, భుశనేశ్వర్, ఢిల్లీ, కోలకతా, ముంబై, బెంగళూరుకు రూట్లలో వర్తిసాయి.













