ఆ దేశాల నుంచి వచ్చేవారికి వీసాలు రద్దు : కేంద్రం
ఇటలీ, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి వచ్చేవారికి భారత ప్రభుత్వం వీసాలు రద్దు చేసింది. నూతన ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటలీ, చైనా ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాలలో అనవసర పర్యటనలు చేయకూడదంటూ భారత పౌరులకు కేంద్ర సూచింది. చైనా, దక్షిణకొరియా, ఇరాన్, ఇ•లీ, హాంకాంగ్, మకావ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, థాయిలాండ్, సింగపూర్, తైవాన్ నుంచి వచ్చేవారికి మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే అనుమతి ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.













