సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో ఓ గేట్‌కు సెహ్వాగ్ పేరుపెట్టారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఈ గేట్‌ని సెహ్వాగ్ చేతి ప్రారంభోత్సవం చేయించింది. మూడుటీ 20లసిరీస్లో భాగంగా భారత్- న్యూజిలాండ్ జట్ల మద్య తొలి టీ20 ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిడిసిఏ సెహ్వాగ్ గేట్‌ని ప్రారంభించింది. ఈ సందర్భంగా గేట్ దగ్గర సెహ్వాగ్ సాధించిన రికార్డులను, విజయాలు పొందు పరిచింది.













