టుస్సాడ్స్ లోకి కోహ్లీ వచ్చేశాడు!
దేశ రాజధానిలో ఏర్పాటైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత జట్టు జెర్సీ ధరించిన కోహ్లి బ్యాక్ పుట్ తీసుకోని షాట్ ఆడేందుకు తీక్షణంగా చూస్తున్నట్లుగా ఉంది ఈ విగ్రహం. అతడి బొమ్మకు సమీపంలోనే భారత ఫాస్ట్బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్ మైనపు విగ్రహం ఉండటం విశేషం. నా బొమ్మ తయారు చేయడానికి చేసిన ప్రయత్నాలు అభినందిస్తున్నా. విగ్రహ ఏర్పాటుకు నన్ను ఎంపిక చేయడం ద్వారా జీవిత కాల అనుభవాన్ని మిగిల్చిన టుస్సాడ్స్కు ధన్యవాదాలు. నా విగ్రహం చూసి అభిమానులు ఎలా స్పందిస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని కోహ్లీ ఓ ప్రకటనలో తెలిపారు.













