ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్న విరాట్ కోహ్లీ?
భారత ప్రభుత్వం, కేంద్ర క్రీడాశాఖ ఏటా ప్రతిష్ఠాత్మకంగా అందించే రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును సిఫార్సు చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన సుదీర్ఘ సీరీస్ తరువాత ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇంగ్లండ్ సీరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు. టెస్ట్ సీరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు చేసిన కోహ్లీ 68.00 బ్యాటింగ్ యావరేజ్‌తో 544 పరుగులు చేశాడు. సీరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్నప్పటికీ విరాట్ ఆట తీరు అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరో వైపు విరాట్ కోహ్లీతో పాటు ఈ అవార్డుకు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను పేరుకు కూడా సిఫార్సు చేశారు. అయితే, ఈ సిఫార్సులపై కేంద్ర క్రీడా శాఖ పరిశీలన చేసి తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది.













