విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం
ఇంగ్లాండ్‌లో బాగా ప్రాచుర్యం కలిగిన క్రికెట్ మద్దతుదారులు గల బార్మీ ఆర్మీ క్లబ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇంటర్నేషనల్ ఫ్లేయర్‌గా ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్ట్మ్యాచ్కు సన్నద్దంగా జరిగిన ఎస్సెక్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోహ్లీ అర్థ సెంచరీ నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ క్లబ్ విరాట్ కోహ్లీను 2017-18 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఫ్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసినట్టు ప్రకటించిది. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తన అధికారిక ట్విటర్లో తెలిపింది.













