ఆ జాబితాలో భారత్ నుంచి ఒకే ఒక్కడు
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ స్థానం సంపాదించుకున్నాడు. భారత్ నుంచి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం విశేషం. 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు టాప్-100లో నిలిచారు. అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
24 మిలియన్ల డాలర్ల ఆదాయంతో ఫోర్బ్స్ జాబితాలో కోహ్లీ 83వ స్థానంలో నిలిచాడు. 4 మిలియన్ల డాలర్లను జీతంగా అందుకుంటున్న కోహ్లీ మిగత 20 మిలియన్ డాలర్లను వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదిస్తున్నారు. అమెరికాకు చెందిన బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయడ్ మేవెదర్ 285 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అర్జైంటినా పుల్బాల్ ఆటగాడు మెస్సీ (111 మిలియన్ డాలర్లు), పోర్చుగల్ పుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(108 మిలియన్ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది టాప్-100 జాబితాలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం.













