క్రీడా పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వెయిట్ లిప్టింగ్ ప్రపంచ ఛాంపియన్ మీరాబాయి చాను ప్రతిష్ఠాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని క్రీడామంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల 25న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏటా ఆగస్టు 29న ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈసారి ఆసియా క్రీడల్లో ప్రదర్శనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడంతో ఆలస్యమైంది. అర్జున అవార్డు లకు 20 మందిని ఎంపిక చేశారు. ఇందులో జావెలిన్ త్రోయర్ నీరాజ్ చోప్రా, సిక్కి రెడ్డి తదితరులు ఉన్నారు. ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల జాబితాను కూడా క్రీడా మంత్రిత్వశాఖ విడుదల చేసింది. రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను విజేతలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేస్తారు.













