ఉపరాష్టప్రతిని కలిసిన ప్రముఖులు
ఉపరాష్టప్రతిగా బాధ్యతలు చేపట్టిన వెంకయ్య నాయుడును పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖలు కలిసి అభినందనలు తెలియజేశారు. గురువారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెజి బాలకృష్ణన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి, సిబిఐ డైరెక్టర్ ఆలోక్ కుమార్ వర్మ ఉపరాష్టప్రతిని కలిశారు. పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి శ్రీరాజీవ్ యాదవ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వేద్ప్రకాశ్, మాజీ ఐపిఎస్ అధికారిణి అరుణా బహుగుణ వెంకయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు.













