డిసెంబర్ 4 నుంచి సింగపూర్ కు విమాన సర్వీసులు
గన్నవరం నుంచి సింగపూర్‌కు ప్రారంభం కావాల్సిన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు డిసెంబరు 4కు వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం, భారత విమానయాన సంస్థ (ఏఏఐ) ఇండిగో సంస్థలు ముందుగా ప్రారంభ తేదీని ఈ నెల 25గా నిర్ణయించాయి. అనుమతులు రావడానికి ఆలస్యమయిందని, అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థకు అతి తక్కువ సమయమే మిగిలిందని, అందుకే వాయిదా వేసినట్టు ప్రభుత్వ విద్యుత్తు, మౌలికవసతులు, పెట్టుబడుల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 4న ప్రారంభమయ్యే సర్వీసు కోసం ఈ నెల 26 నుంచి ఇండిగో సంస్థ టిక్కెట్ల విక్రయాన్ని ఆరంభించే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. విజయవాడ నుంచి వారానికి రెండు రోజులు సింగపూర్‌కు ఈ సర్వీసు నడవనుంది.













