విజయవాడ- కొచ్చిన్ కు విమాన సర్వీస్ ప్రారంభం
విజయవాడ నుంచి కేరళలోని కొచ్చిన్‌కు రోజువారీ విమాన సర్వీసు ప్రారంభమైంది. స్పైస్‌జెట్ విమానయాన సంస్థ ఈ సర్వీసును నడుపుతుంది. ప్రతి రోజు సాయంత్రం స్పైస్‌జెట్ విమానం 4:20 గంటలకు వచ్చి అయిదు గంటలకు బయలుదేరి తిరుపతి మీదుగా కొచ్చిన్ వెళుతుంది. 72 సీట్లు సామర్థ్యం ఉన్న స్పైస్‌జెట్ విమానం ప్రారంభం తొలి రోజునే అన్ని సీట్లు నిండాయి. ఈ సర్వీసును ఎయిర్ పోర్టు డైరెక్టర్ జి.మధుసూధనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ విమానంలో ప్రయాణించే ఎనికేపాడుకు చెందిన ఫాదర్ జోస్ఫ్కు తొలి బోర్డింగ్ పాస్‌ను అందజేశారు. తిరుపతి, బెంగళూరు, కొచ్చిన్ వెళ్ళేవారికి ఈ విమాన సర్వీసు మంచి సౌలభ్యంగా ఉంటుందన్నారు.













