రికార్డు సృష్టించిన ఉపరాష్ట్రపతి
దేశంలో ఏ ప్రాంతానికెళ్లినా మాతృభాషను మరవద్దని పదేపదే ఉద్బోధించే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజు సరికొత్త రికార్డుకు తెరతీశారు. రాజ్యసభలో 12 భాషలు మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. రాజ్యసభలో ఎంపీలు మరో ఐదు భాషల్లో మాట్లాడానికి అనుమతించారు. ప్రస్తుతం 17 భాషల్లో ఎంపీలు మాట్లాడే అవకాశం ఉందని, దాన్ని 22కు పెంచుతున్నట్లు వెంకయ్య తెలిపారు. కొత్తగా డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంతాలి, సింధి భాషల్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఫలానా భాషలో మాట్లాడవచ్చు అని తెలుగు, హిందీ, ఇంగ్లీషు, బంగ్లా, గుజరాతి, కన్నడ, మలయాళం, మరాఠి, ఒరియా, పంజాబీ, తమిళ్‌తో పాటు నేపాలీలో వెంకయ్య మాట్లాడారు.













