ప్రచారం చేసే ప్రసక్తే లేదు: వెంకయ్య
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం రాష్ట్రాల్లో ప్రచారం చేసే ప్రసక్తే లేదని ఎన్డీఏ అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు సృష్టం చేశారు. ఉపరాష్ట్రతి అభ్యర్థి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది ఉన్నతమైన వ్యక్తులు అధిరోహించిన స్థానానికి మరింత గౌరవం తెచ్చేలా నడుచుకుంటానని అన్నారు. ఈ రోజు నుంచి నా పాత్ర మారిపోతుంది. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ఇప్పుడు విభిన్న పాత్ర పోషించబోతున్నాను. నా పాత్రకు న్యాయం చేస్తాననే అనుకుంటున్నాను అని అన్నారు. తాను సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, పార్టీ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు. ఏడాదిన్నర వయసులో తల్లిని కోల్పోయాను. పార్టీనే తల్లిగా భావిస్తూ జీవితం గడిపాను. ఇప్పుడు పార్టీని వీడాల్సిన పరిస్థితి. తల్లిలాంటి పార్టీని వీడేటప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. నాకు మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు అని అన్నారు.













