భారతీయ రాయబారులతో ఉపరాష్ట్రపతి భేటీ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన నివాసంలో 125 దేశాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న భారత రాయబారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ గొప్పతనాన్ని చాటిచెపాల్సిన బాధ్యత రాయబారులపై ఉందన్నారు. దురదృష్టవశాత్తు కొన్ని దేశాల ప్రజలకు మన పట్ల ఉన్న వ్యతిరేక అభిప్రాయాలను సరిదిద్దాల్సిన బాధ్యత రాయబారులందరిపైనా ఉందన్నారు. అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్లలో ప్రధాని మోదీ ఓ నూతన భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశారంటూ శ్లాఘించారు. ప్రపంచదేశాలన్నీ మోదీ పరిచయం చేసిన నూతన భారతావనిని చూడగలుగుతున్నాయన్నారు.













