మహిళా రౌడీషీటర్ కు గౌరవ డాక్టరేట్
ఆమె బెంగళూరులోనే మొదటి మహిళా రౌడీషీటర్. పేరు యశస్విని. కరుడుగట్టిన హిందూ సంస్థ శ్రీరామసేనకు బెంగళూరు నగర అధ్యక్షురాలు. రౌడీషీట్ తెరవడంతో మార్మోగిన యశస్విని పేరు ఇప్పుడు మరో విషయంలో సంచలనంగా మారింది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ సామాజిక సేవ విభాగంలో ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేయడమే ఈ సంచలనానికి కారణం. దీంతో 2 రోజులుగా డాక్టర్ రౌడీషీటర్ అంటూ పెద్ద చర్చే నడుస్తోంది. వాస్తవానికి అక్రమ వడ్డీ దందాతో పలువురు మహిళలపై దాడి చేసినట్లు యశ్వసినిపై ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసులు నమోదయ్యాయి. దాంతో పోలీసులు రౌడీషీట్ తెరిచారు. కిందటి నేలలో ఆమెను శ్రీరామసేనకు బెంగళూరు అధ్యక్షురాలుగా నియమించారు. కాగా, రౌడీషీటర్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వడంపై బెంగళూరు పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.













