చంద్రన్న విలేజ్ మాల్ ను సందర్శించిన అమెరికా బృందం
విజయవాడలోని విద్యాధరపురం చెరువు సెంటర్లోని చంద్రన్న విలేజ్ మాల్‌ను అమెరికాకు చెందిన సెంట్రల్ ఫర్ గ్లోబల్ రీసెర్చ్ స్కాలర్స్ బృందం పరిశీలించింది. నగదు రహిత లావాదేవీలపై చేసే అధ్యయనంలో భాగంగా గత మూడు రోజులుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ బృందం పర్యటిస్తోంది. చంద్రన్న విలేజ్ మాల్‌ను పరిశీలించిన బృందం సభ్యులు ఎలీన్ క్లబ్ మాట్లాడుతూ తమ దేశంలో నగదు రహిత లావాదేవీలను క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విలేజ్ మాల్స్‌లో కొనుగోలు చేసిన వినియోగదారుని ఖాతా నుంచి ఈ పాస్, ఐరిష్ ద్వారా చెల్లింపులు జరగటం హర్షనీయం అన్నారు. డీఎస్వో జి.నాగేశ్వరరావు, సభ్యులు అనిత్ ముఖర్జీ, విక్రంశర్మ, మహిళ బృందం సభ్యులు తదితరలు పాల్గొన్నారు.
.













