గౌరీ లంకేశ్ హత్యకు అమెరికా ఖండన
సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యను అమెరికా ఖండించింది. లంకేశ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్త పత్రికా స్వేచ్ఛను సమర్థించింది. కన్నడ జర్నలిస్టు గౌరీ లంకేశ్ (55)ను బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్లో దుండగులు కాల్చి చంపారు. కారులో ఇంటికి తిరిగి వచ్చిన అమె ఇంటి గేట్ తెరుస్తుండగా మోటర్ సైకిల్‌పై వచ్చిన దుండగలు గౌరీ లంకేశ్‌పై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడారు. రెండు తూటాలు ఛాతిలోకి దూసుకుపోగా, మరొటి సుదిటి పై తాకడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.













