సురవరం, ఏచూరి రాజీనామా?
లోక్సభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఘోర పరాజయం చెందినందుకు బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం ఏచూరి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వామపక్షాల అపజయాలకు తాము పూర్తి బాధ్యత వహిస్తామని, తమ స్థానంలో మరొకర్ని నియమించవచ్చునని వారిద్దరూ తమ పార్టీ కార్యవర్గ సమావేశాల్లో చెప్పినట్లు సమాచారం. మరో రెండు మూడు నెలల్లో జాతీయ మండలి సమావేశాల్లో ఈ ఇద్దరి స్థానంలో కొత్త వారు బాధ్యతలు స్వీకరించవచ్చని తెలుస్తోంది. కాగా సురవరం సుధాకర్ రెడ్డి స్థానంలో తమిళనాడుకు చెందిన సీపీఐ నేత డి.రాజా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. సీపీఎంలో సీతారాం ఏచూరికి ప్రత్యామ్నాయం ఎవరనే విషయంలో సృష్టత రాలేదని తెలుస్తోంది.













