మహనీయుల త్యాగాలే మనకు ఆదర్శం
దేశ స్వాత్రంత్యం కోసం, ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పాటుపడిన మహనీయుల త్యాగాలే మనకు ఆదర్శం కావాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. దేశ సమగ్రాభివృద్ధిలో యువత ప్రధాన భూమిక వహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కిషన్‌రెడ్డిని దుశ్శాలువ, మొమెంటోతో ప్రత్యేక అతిథి, ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవీ సుబ్బారావు సత్కరించారు.













