అది మోదీ విజయం…
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటం ప్రతి భారతీయుడి విజయమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపజేసేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కషి చేసిందని అన్నారు. ఈవిషయంలో ప్రభుత్వాన్ని, మోదీని మెచ్చుకోవాలని అన్నారు. ప్రతిపక్షాలు ఈ విజయాన్ని పంచుకోవటంలో ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ విదేశాంగశాఖ ఎంతో కషి చేసిందని, మోదీ పదే పదే చేసే విదేశీ పర్యటనల వల్ల ఇది సాధ్యమైందని అన్నారు.













