ఉమాభారతి సంచలన ప్రకటన
కేంద్ర మంత్రి, బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. అయితే రామమందిర కోసం పోరాటాన్ని సాగిస్తానని చెప్పారు. ఇప్పటికే మోడీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మస్వరాజ్, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించగా, ఉమాభారతి సైతం అదే బాటను ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమాభారతి 2014 మే 26 నుంచి 2017 సెప్టెంబర్ 1వ తేదీ వరకూ జనవనరులు, రీవర్ డవలప్మెంట్, గంగా ప్రక్షాళన మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తాగునీరు, పారుశుద్ధ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.













