మోదీపై అసంతృప్తి ఉంది
దేశ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. దసరా సందర్భంగా ముంబైలో నిర్వహించిన శివసేన కార్యకర్తల సమావేశంలో థాకరే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ అనేది ఓ ప్రభంజనమని అన్నారు. అయితే గడిచిన నాలుగేళ్లలో దాని ప్రభావం పూర్తిగా పడిపోయిందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 2014 నాటి ఫలితాలు కనిపించవని థాకరే అన్నారు. బీజేపీ నాయకత్వంలో మరోసారి ఎన్నికలకు వెళ్లడం గురించి థాకరే మాట్లాడుతూ జాతక చక్రంలో శని, మంగళ గ్రహాల ప్రాబల్యం అధికంగా ఉందని, ఆ గ్రహాల నుంచి బీజేపీకి సమస్యలు ఏర్పడతాయని అన్నారు. తాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసు కదా? అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.













