విశాఖ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా నైట్ సర్వీస్
విశాఖపట్నం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు విశాఖపట్నం-ముంబై మధ్య నడవనున్నాయి. మే 15 నుంచి రాత్రి వేళ విమానాలు నడవనున్నాయి. ఈ విమానం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ రాత్రి 7:00 గంటలకు ముంబైలో బయలుదేరి 8:50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. తిరిగి ఇక్కడి నుంచి 9:30 గంటలకు బయలుదేరి 11:20 గంటలకు ముంబై వెళుతుంది. శని, ఆదివారాల్లో మాత్రం, రాత్రి 9:10 గంటలకు ముంబైలో బయలుదేరి 11:00 గంటలకు విశాఖపట్నం వస్తుంది. తిరిగి ఇక్కడి నుంచి 11:30 గంటలకు బయలుదేరి 1:20 గంటలకు ముంబై చేరుతుంది. విశాఖ నుంచి దేశ ఆర్థిక రాజధానికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానుండడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.













